Nanded Gurudwara Attack:కరోనా నేపథ్యంలో హోలా మొహల్లాని ఆపాలని చూసిన పోలీసులు… దాడి చేసిన ప్రజలు
Nanded Gurudwara Attack: మహారాష్ట్రలో రోజు రోజుకీ కరోనా ఓ రేంజ్ కల్లోలం సృష్టిస్తుంది. దీంతో అక్కడ ప్రభుత్వం హొలీ వంటి పండగలపై నిషేదాజ్ఞలు జారీ చేసింది. అంతేకాదు.. కోవిడ్ -19 పరిస్థితి కారణంగా సిక్కుల పండుగైన హోలా మొహల్లా...
Nanded Gurudwara Attack: మహారాష్ట్రలో రోజు రోజుకీ కరోనా ఓ రేంజ్ కల్లోలం సృష్టిస్తుంది. దీంతో అక్కడ ప్రభుత్వం హొలీ వంటి పండగలపై నిషేదాజ్ఞలు జారీ చేసింది. అంతేకాదు.. కోవిడ్ -19 పరిస్థితి కారణంగా గురుద్వారాలో ప్రతి సంవత్సరం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే ‘హోలా మొహల్లా’ కార్యక్రమానికి అనుమతులను ఇవ్వలేదు. దీంతో కొంతమంది ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. దాడి చేశారు. దాదాపు 300 మంది గుంపుగా ఏర్పడి.. కత్తితో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని.. అనేక వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
తాజాగా ఈ దాడికి సంబందించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. గురుద్వారా నుంచి ఒక గుంపు కత్తులు పట్టుకుని బయటకు రావడం.. పోలీసులను కొట్టి.. అక్కడ ఉన్న బారికేడ్లను పగలగొట్టడం వారు సృష్టించిన విధ్వసం అందులో కనిపిస్తున్నాయి.
మహమ్మారి కారణంగా హోలా మొహల్లాకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు ముందుగానే గురుద్వారా కమిటీకి సమాచారం ఇచ్చామని పోలీస్ అధికారులు చెప్పారు. అంతేకాదు.. అప్పుడు ప్రభుత్వఆదేశాలకు కట్టుబడి ఉంటామని గురుద్వారా ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని కమిటీ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు హామీనిచ్చారని నాందేడ్ రేంజ్ డిఐజి నిసార్ తంబోలి చెప్పారు.
అయితే నిషాన్ సాహిబ్‌ను సాయంత్రం 4 గంటల సమయంలో గేట్ వద్దకు తీసుకువచ్చినప్పుడు, చాలా మంది పాల్గొన్నారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.. అదే సమయంలో 300 మందికి పైగా యువకులు గేట్ నుండి బయటకి వచ్చి, బారికేడ్లను పగలగొట్టి, పోలీసులపై దాడి చేయడం ప్రారంభించారు,” అని తంబోలి చెప్పారు.
ఈ దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద 307 సెక్షన్, 324 , 188, 269 కింద కేసులు నమోదు చేస్తామని.. తెలిపారు. భారత శిక్షాస్మృతి (ఐపిసి) ప్రకారం అల్లర్లు సృష్టించిన వారిలో కనీసం 200 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతుందని తంబోలి తెలిపారు.
Also Read: వంటలక్క లేటెస్ట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్