AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాల్తేర్ క్లబ్ జోలికొస్తే ఊరుకోను.. రఘురాం హెచ్చరిక ఎవరికో?

విశాఖ రాజకీయాలను అట్టుడికిస్తున్న విశాఖ వాల్తేర్ క్లబ్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. వాల్తేర్ క్లబ్ భూములకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎసరు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు వాల్తేర్ క్లబ్ భూములను గతంలో టీడీపీ వారు ఆక్రమించి పార్టీ ఆఫీసు కట్టుకున్నారంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు వైసీపీ నేతలనుద్దేశించా […]

వాల్తేర్ క్లబ్ జోలికొస్తే ఊరుకోను.. రఘురాం హెచ్చరిక ఎవరికో?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 08, 2020 | 3:52 PM

Share

విశాఖ రాజకీయాలను అట్టుడికిస్తున్న విశాఖ వాల్తేర్ క్లబ్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనంటూ హెచ్చరించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. వాల్తేర్ క్లబ్ భూములకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎసరు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు వాల్తేర్ క్లబ్ భూములను గతంలో టీడీపీ వారు ఆక్రమించి పార్టీ ఆఫీసు కట్టుకున్నారంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు వైసీపీ నేతలనుద్దేశించా ? లేక టీడీపీ నేతలనుద్దేశించా? అన్న చర్చ మొదలైంది.

శుక్రవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ఎంపీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మాటా మంతీ కొనసాగింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు… వాల్తేరు క్లబ్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మిగిలిన ఇద్దరు ఎంపీల ముందు కుండబద్దలు కొట్టారు. తాను కూడా వాల్తేర్ క్లబ్‌లో సభ్యుడినేనని పేర్కొన్న రఘురామకృష్ణ రాజు.. క్లబ్ జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని వ్యాఖ్యానించారు.

గత కొన్నాళ్లుగా నా రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణ రాజు తాజా మరింత రెచ్చిపోవడం దేనికి సంకేతమని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ ఎంపీలంతా పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు నడచుకుంటుంటే.. రఘురామకృష్ణ రాజు వేరే దారిలో వెళుతున్నారని చెప్పుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్‌కు మెచ్చుకోవడం, ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు కురిపించడం వంటివి చేస్తూ పార్టీ అధినాయకత్వానికి ఎంబరాస్సింగ్‌గా రఘురామకృష్ణ రాజు తయారయ్యారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా.. బీజేపీ పెద్దలకు సన్నిహితంగా రఘురామకృష్ణ రాజు మసలుతుండడంతో మీడియా డిబేట్లకు సైతం రఘురామకృష్ణ రాజును వైసీపీ అధిష్టానం దూరం పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలో రఘురామకృష్ణ రాజు తాజా వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తిగా మారింది.