క్రికెటర్లూ… జమ్ముకశ్మీర్‌ వీడండి!

జమ్ముకశ్మీర్‌ నుంచి టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో సహా వందమంది యువ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తరలివెళ్లాలని చెప్పిన్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సీఈవో సయ్యద్‌ ఆశిక్‌ హుస్సేన్‌ బుఖారీ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల మధ్య క్రికెటర్లందరినీ వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. […]

క్రికెటర్లూ... జమ్ముకశ్మీర్‌ వీడండి!
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 6:06 PM

జమ్ముకశ్మీర్‌ నుంచి టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో సహా వందమంది యువ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తరలివెళ్లాలని చెప్పిన్నట్లు ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం సీఈవో సయ్యద్‌ ఆశిక్‌ హుస్సేన్‌ బుఖారీ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల మధ్య క్రికెటర్లందరినీ వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ జట్టుతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడితోపాటు శిక్షకుడు సుదర్శన్‌ ఆదివారం కశ్మీర్‌ లోయను వీడిపోతున్నారని బుఖారీ చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో జరగాల్సిన అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని, పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ నిర్వహిస్తామని బుఖారీ పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో శిక్షణ పొందుతున్న వంద మందికి పైగా యువ క్రికెటర్లను వారి గమ్యస్థానాలకు తరలించామని, ప్రస్తుతం అక్కడ ఏం జరగుతుందో అర్థంకావడం లేదని బుఖారీ పేర్కొన్నాడని రాసింది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవడంతో పాటు బీసీసీఐ కూడా స్పందించకపోవడం గమనార్హం.

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.