గోదావరి పోటెత్తిన వరద… ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ఉరకలేస్తోంది. . ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రవాహం మరింత పెరగడంతో అధికారులు తాజాగా రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. డెల్టాకాల్వకు 7,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13.10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 45.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇక్కడ మొదటి […]

గోదావరి పోటెత్తిన వరద... ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 7:51 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ఉరకలేస్తోంది. . ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి ప్రవాహం మరింత పెరగడంతో అధికారులు తాజాగా రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. డెల్టాకాల్వకు 7,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13.10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 45.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వరుసగా ఐదో రోజూ జలదిగ్బంధంలోనే ఉంది. మండలంలోని 32 గ్రామాలు నీటమునిగాయి. దీంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని బాధితులు వాపోతున్నారు.హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు బాధితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.