బీజేపీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఇచ్చమొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరిక.
తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ తప్పుపట్టారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..

cp sajjanar counter to raja singh: తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ తప్పుపట్టారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. హైదారాబాద్‌లోని బహుదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీని రాజా సింగ్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజా సింగ్.. ‘కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని’ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ తాజాగా స్పందించారు. ఇటీవల పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం ఫ్యాషన్‌గా మారిందని ఆయన మండిపడ్డారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై కచ్చితంగా లీగల్ చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
