Bigg boss season 14: బిగ్‌బాస్ హౌస్‌లో మ్యారేజ్ ప్రపోజల్.. నీతో జీవితాంతం ఉండాలని ఆ కంటెస్టెంట్‌కు..
సల్మాన్ వ్యాఖ్యతగా వ్వహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 14లో ప్రేమ జంటలు బాగానే కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్న జంటల మధ్య ప్రేమాయణాలు జరిగాయి. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న

సల్మాన్ వ్యాఖ్యతగా వ్వహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 14లో ప్రేమ జంటలు బాగానే కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్న జంటల మధ్య ప్రేమాయణాలు జరిగాయి. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అలీ గోని, జాస్మిన్ భాసిన్ మధ్య జరిగిన సంభాషణ వైరల్‍గా మారింది.
పలు హిందీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీగోని, జాస్మిన్ భాసిన్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అలీగోని తన తోటి కంటెస్టెంట్ జాస్మిన్ భాసిన్‌కు మ్యారెజ్ ప్రపోజల్ చేయాలనడం తెగ వైరల్ అయింది. జాస్మిన్ ముందు మోకాళ్ళపై కూర్చోని అలీ మ్యారెజ్ ప్రపోజ్ చేయాలని జాస్మిన్ కోరింది. కాగా తాజా ఎపిసోడ్లో వాళ్ళీద్దరు పెళ్ళి గురించి చర్చిస్తూ కనిపించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రియురాలిని వెతుక్కోవడం, తర్వాత ఆమెతో కొన్ని ట్రావెల్ చేసి నాకు సరిపోతుందా? లేదా అనే విషయం తెలుసుకోవడానికి టైం తీసుకోవడం, ఒక వేళ అది నచ్చకపోతే వదిలేయడం టైం వేస్ట్ అని అలీ అన్నారు. అలా కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్ళి చేసుకోవడం మంచిదని అనుకుంటున్నాను. నీతో నేను జీవితాంతం ఉండటానికి నాకు ఎలాంటి సందేహాలు లేవు అని అలీగోని జాస్మిన్‌తో ముచ్చటించారు.
