ఫెదరర్ రికార్డుకు చేరువలో సెర్బియా స్టార్.. మరో పది వారాల్లో చరిత్ర సృష్టించనున్న జకోవిచ్

ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్న ఘనత సెర్బియా స్టార్ ఖాతాలో పడింది. ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను....

ఫెదరర్ రికార్డుకు చేరువలో సెర్బియా స్టార్.. మరో పది వారాల్లో చరిత్ర సృష్టించనున్న జకోవిచ్
Follow us

|

Updated on: Dec 22, 2020 | 6:48 PM

Djokovic Has Officially Hit : సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ సరికొత్త రికార్డును క్రియేట్  చేశాడు. జకోవిచ్ చెప్పినట్లుగా పంతం నెగ్గించుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఎక్కువ వారాలు టాప్ ర్యాంక్‌లో ఉండే రికార్డు సొంతం చేసుకుంటానని గతంలో జకోవిచ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటీపీ ప్రకటించిన ర్యాంకుల పట్టికలో మరోసారి టాపర్‌గా నిలిచాడు.

దీంతో ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్న ఘనత సెర్బియా స్టార్ ఖాతాలో పడింది. ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను అందుకునేందుకు జకోవిచ్‌కు కావాల్సింది మరో పది వారాలే. 310 వారాల పాటు అగ్రస్థానంలో రికార్డు ఇప్పటి వరకు ఫెదరర్‌ పేరుతో ఉంది. అయితే 33 ఏళ్ల జకోవిచ్‌ తొలిసారి 2011 జులైలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో  జకోవిచ్ అయిదోసారి మొదటి స్థానానికి చేరుకున్నాడు.