కోవిడ్ వ్యాక్సిన్.. భారత్‌లో ఆక్స్‌ఫోర్డ్ టీకాకే మొదటి ఛాన్స్.. కేంద్రం అనుమతించే అవకాశం.!
First Covid Vaccine: దేశమంతటా జనవరి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే..
First Covid Vaccine: దేశమంతటా జనవరి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదట ఏ టీకాకు అనుమతి లభిస్తుందా.? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్న ‘కొవిషీల్డ్’ టీకా వైపే ఎక్కువగా ఔషధ నియంత్ర సంస్థలు మొగ్గు చూపుతుండటంతో.. దానికే తొలి అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దేశీయంగా ఆక్స్‌ఫోర్డ్ టీకాను పూణేకు చెందిన సీరం సంస్థ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సంస్ధ టీకా అనుమతులకు కావాల్సిన సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి అందించిందని తెలుస్తోంది.
యూకేలో “కొవిషీల్డ్” టీకాకు అనుమతులు లభించిన వెంటనే CDSCO కమిటీ నిపుణులు సమావేశమై.. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ డేటాను పరిశీలించనున్నారు. వ్యాక్సిన్ భద్రతా, వైరస్ నిరోధకతపై చర్చించి అత్యవసర వినియోగానికి అనుమతించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తన వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. అయితే భారత్ బయోటెక్ తయారు చేసే ‘కోవాగ్జిన్’కు సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. దీనితో అనుమతి లభించేందుకు మరికొంత సమయం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఫైజర్ సంస్థ కూడా తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. దీనితో ఇండియాలో అత్యవసర వినియోగానికి ‘కొవిషీల్డ్’కే తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు. కాగా, సీరం సంస్థ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను సిద్ధం చేసింది.
Also Read:
హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!
కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!
ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!