15 ఏళ్ల బాలుడికి కరోనా.. ఇంట్లోకి రానివ్వని ఇంటి యాజమాని

జ‌గిత్యాల జిల్లా అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిందని బాలుడిని ఇంట్లోకి రానిచ్చేందుకు ఇంటి యాజమాని నిరాకరించాడు. దీంతో బస్టాండే అతని క్వారంటైన్ అయ్యింది.

15 ఏళ్ల బాలుడికి కరోనా.. ఇంట్లోకి రానివ్వని ఇంటి యాజమాని
Follow us

|

Updated on: Aug 20, 2020 | 9:15 PM

జ‌గిత్యాల జిల్లా అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిందని బాలుడిని ఇంట్లోకి రానిచ్చేందుకు ఇంటి యాజమాని నిరాకరించాడు. దీంతో బస్టాండే అతని క్వారంటైన్ అయ్యింది. చింతకుంటవాడకు చెందిన15ఏళ్ల బాలుడు అమ్మ‌మ్మతో క‌లిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండడంతో ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో బాలుడిని పరిశీలించిన సిబ్బంది కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయ‌గా పాజిటీవ్ గా నిర్థారించారు. దీంతో అతన్ని హోం ఐసోలేష‌న్ లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఇంట్లోనే ఉంటూ క‌రోనా ట్రీట్మెంట్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, ఆ బాలుడికి క‌రోనా సోకింద‌ని తెలుసుకున్న ఇంటి య‌జ‌మాని.. ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించాడు. ఇరుగుపొరుగు వారు నచ్చజెప్పిన ససేమిరా అన్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలుడు స్థానికంగా ఉన్న బ‌స్టాండ్ లోనే ప‌డిగాపులుగాశాడు. అయితే, బాలుడి గురించి స‌మాచారం అందుకున్న స్థానికులు.. జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో బాలుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇంటి యాజమాని తీరుపట్ల స్థానికులు మండిపడుతున్నారు.