Covid 19 Vaccine: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు షాక్..? ఫైజర్, మెడెర్నా కీలక నిర్ణయం

వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుస్తున్న రాష్ట్రాలకు షాకిచ్చాయి ఫైజర్, మోడెర్నా కంపెనీలు. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా చేయబోమని స్పష్టం చేశాయి.

Covid 19 Vaccine: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు షాక్..? ఫైజర్, మెడెర్నా కీలక నిర్ణయం
Follow us

|

Updated on: May 24, 2021 | 1:37 PM

Coronavirus Vaccine Global Tenders: వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుస్తున్న రాష్ట్రాలకు షాకిచ్చాయి ఫైజర్, మోడెర్నా కంపెనీలు. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా చేయబోమని స్పష్టం చేశాయి. కంపెనీల పాలసీ ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తామని క్లారిటీ ఇచ్చాయి. దీంతో గ్లోబల్ టెండర్లకు పిలిచిన పంజాబ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గత వారం తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఫైజర్, మోడెర్నా కంపెనీల నిర్ణయంతో గ్లోబల్ టెండర్లకు అవరోధంగా మారింది.

తెలంగాణ ప్రభుత్వం 4కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10మిలియన్ డోసులు సేకరించాలని భావించింది. బిడ్‌ల గడువు జూన్‌ 4వరకు గడువు విధించింది. కేవలం ఆరు నెలల్లో 10మిలియన్ డోసులు పంపిణీ చేయాలని కండీషన్‌ కూడా విధించింది. కానీ, అంతలోనే ఫైజర్, మోడెర్నా కంపెనీలు రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. దీంతో వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రంమీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. రాష్ట్రాలు పిలిచిన టెండర్లలో చాలా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే మోడెర్నా, ఫైజర్ కంపెనీలు రాష్ట్రాలకు ఝలక్ ఇచ్చాయి. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాష్ట్రాల ఆశలపై నీళ్లుచల్లినట్టయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి వ్యాక్సిన్ అందిందనే విషయాలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 79 లక్షల 175 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 55 వేల 720 మందికి మొదటి డోస్ అందగా.. 23 లక్షల 44 వేల 455 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 55 లక్షల 24 వేల 649 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 53 వేల 87 మంది. రెండో డోస్ పూర్తైన వారు 10 లక్షల 71 వేల 562 మంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించింది.

Read Also…  Covid-19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వద్దు మహాప్రభో.. నదిలోకి దూకి పారిపోయిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది