గుడ్ న్యూస్… మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు

కరోనావైర‌స్ నేపథ్యంలో దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఇబ్బందులు ఎదుర్కొకుండా బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు కొవిడ్‌-19 లోన్స్ ఇచ్చేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వికారాబాద్ మండలంలో 1100లకు పైగా మహిళా సంఘాలుండ‌గా.. అందులో అర్హత ఉన్న 859 మహిళా సంఘాలకు కొవిడ్‌-19 బ్యాంకు రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. లోన్స్ అందించేందుకు గ్రామాల‌కు చెందిన‌ మహిళా సంఘాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్ప‌టికే సెర్ప్‌ సిబ్బంది బ్యాంకులకు సమర్పించారు. మండలంలో ఎస్‌బీఐతో పాటు […]

  • Updated On - 4:14 pm, Mon, 25 May 20 Edited By: Pardhasaradhi Peri
గుడ్ న్యూస్...  మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు

కరోనావైర‌స్ నేపథ్యంలో దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఇబ్బందులు ఎదుర్కొకుండా బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు కొవిడ్‌-19 లోన్స్ ఇచ్చేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వికారాబాద్ మండలంలో 1100లకు పైగా మహిళా సంఘాలుండ‌గా.. అందులో అర్హత ఉన్న 859 మహిళా సంఘాలకు కొవిడ్‌-19 బ్యాంకు రుణాలు అందించాలని అధికారులు నిర్ణయించారు. లోన్స్ అందించేందుకు గ్రామాల‌కు చెందిన‌ మహిళా సంఘాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్ప‌టికే సెర్ప్‌ సిబ్బంది బ్యాంకులకు సమర్పించారు. మండలంలో ఎస్‌బీఐతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ముజాహిద్‌పూర్, చౌడాపూర్‌, ‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులు లోన్స్ అందిస్తున్నాయి.

ప్రతి సభ్యురాలికి రూ. 5వేలు లోన్…

మహిళా సంఘాల్లోని ప్రతి మహిళకు రూ. 5వేల కొవిడ్ లోన్ అందించేందుకు అధికారులు చర్యలు చేప‌డుతున్నారు. సెర్ప్ సిబ్బంది బ్యాంకులకు మహిళా సంఘాలకు సంబంధించి డాక్యుమెంట్స్‌ అందజేస్తుండటంతో బ్యాంకర్లు కూడా ఎటువంటి జాప్యం లేకుండా లోన్స్ మంజూరు చేస్తున్నారు. దీంతో మహిళా సంఘంలోని ప్రతి మహిళకు రూ.5 వేల లోన్ అందుతుంది. కాగా తీసుకున్న లోన్స్ 18 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ. 300 చొప్పున‌ తీసుకున్న కొవిడ్ లోన్ కు వాయిదా చెల్లించాలి.