కూల్..కూల్.. భూకంపానికి అదరని, బెదరని న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్దర్న్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అబ్బో ! ఆమె ఉక్కు లాంటి మహిళ’ అని ఆకాశానికెత్తేస్తున్నారు. మరి ఇందుకు నిదర్శనంగా ఓ టీవీ లైవ్ ఇంటర్వ్యూ లో ఆమె చూపిన సాహసమే నిలుస్తోంది. ఆమె ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో.. వెల్లింగ్టన్ కి సుమారు 30 మైళ్ళ దూరంలోని భూకంప కేంద్రంలో 5.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీంతో ఆమె ఉన్న భవనం స్వల్పంగా కంపించింది. కానీ జసిండా బెదరలేదు […]

  • Publish Date - 4:25 pm, Mon, 25 May 20 Edited By: Pardhasaradhi Peri
కూల్..కూల్.. భూకంపానికి అదరని, బెదరని న్యూజిలాండ్ ప్రధాని

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్దర్న్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అబ్బో ! ఆమె ఉక్కు లాంటి మహిళ’ అని ఆకాశానికెత్తేస్తున్నారు. మరి ఇందుకు నిదర్శనంగా ఓ టీవీ లైవ్ ఇంటర్వ్యూ లో ఆమె చూపిన సాహసమే నిలుస్తోంది. ఆమె ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో.. వెల్లింగ్టన్ కి సుమారు 30 మైళ్ళ దూరంలోని భూకంప కేంద్రంలో 5.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీంతో ఆమె ఉన్న భవనం స్వల్పంగా కంపించింది. కానీ జసిండా బెదరలేదు సరికదా..’ నా వెనుక వస్తువులు కదులుతున్నాయి..చూస్తున్నారా ? మనకు కాస్తంత భూకంప తాకిడి వచ్చింది.. డీసెంట్ షేక్ హియర్’ అని వ్యాఖ్యానించారు. పైగా ఈ బిల్డింగ్ కాస్త కదులుతున్నట్టు కనిపిస్తోంది. ఆ..ఆ..ఇప్పుడు ఆగిపోయింది.. నేనేమీ తడబాటు పడడం లేదు..ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా యూజర్లు ఆమె కూల్ నెస్ ని చూసి ఆశ్చర్యపోతూ.. ప్రశంసలు గుప్పించారు. కాగా- ఈ భూకంపంలో ఎవరూ గాయపడడం లేదా మరణించడం జరగలేదు.