తెలంగాణలో కొత్తగా 1,567 మందికి కరోనా
తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. గురువారం కొత్తగా 1,567 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇవాళ కరోనా బారినపడి తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ర్టవ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది.

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. గురువారం కొత్తగా 1,567 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇవాళ కరోనా బారినపడి తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ర్టవ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి 447 మంది ప్రాణాలొదిలారు. తాజాగా 1,661 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇప్పటివరకూ కోలుకుని 39,327 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కరోనా కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.




