కరోనా అప్డేట్: కోలుకున్నవారు 2,95,248.. యాక్టివ్ కేసులు 94,209
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,621 పాజిటివ్ కేసులు, 92 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,621 పాజిటివ్ కేసులు, 92 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. ఇందులో 94,209 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,95,248 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3633కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,528 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 34,79,990 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 815, చిత్తూరులో 928, తూర్పు గోదావరిలో 1089, గుంటూరులో 926, కడపలో 844, కృష్ణాలో 316, కర్నూలులో 855, నెల్లూరులో 934, ప్రకాశంలో 1020, శ్రీకాకుళంలో 846, విశాఖలో 593, విజయనగరంలో 563, పశ్చిమ గోదావరిలో 892 కేసులు నమోదయ్యాయి.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..
తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..
కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!
అక్రమ లేఅవుట్లకు చెక్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉబర్‌లో అద్దెకు ఆటోలు..
మహిళలు, చిన్నారుల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’కు శ్రీకారం.!




