భారత్‌లో సత్ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్..!

సైంటిస్టులు వైరస్ నియంత్రణకు మందు కనుక్కోనే పనిలోపడ్డారు. అటు భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ రెండో దశకు చేరుకున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భారత్‌లో రెండో దశ ప్రయోగం విజయవంతం కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భారత్‌లో సత్ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్..!
Follow us

|

Updated on: Aug 27, 2020 | 5:32 PM

కరోనా కల్లోలానికి ప్రపంచం విలవిలలాడుతోంది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఆశగా జనం ఎదురుచూస్తున్నారు. అన్ని దేశాల సైంటిస్టులు వైరస్ నియంత్రణకు మందు కనుక్కోనే పనిలోపడ్డారు. అటు భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ రెండో దశకు చేరుకున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భారత్‌లో రెండో దశ ప్రయోగం విజయవంతం కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదే క్రమంలో పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో ఇద్దరు వాలంటీర్లకు బుధవారం ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించి పరీక్షించారు. ఇద్దరిలోనూ ఆరోగ్యం, శరీర పనితీరును పరిశీలించారు. వాలంటీర్లు ఇద్దరు చక్కగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఈ ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను 32, 48 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులకు మొదటి డోసు వేశారు. బుధవారం ఈ వ్యాక్సిన్‌ ఇచ్చిన దగ్గరి నుంచి వైద్య సిబ్బంది వారిని పరిశీలనలో ఉంచారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. నొప్పి, జ్వరం, సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర అనారోగ్య సూచనలేమీ కనిపించలేదన్నారు. వారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఇంటికి పంపివేశారు. వారిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది సంప్రదిస్తూనే ఉన్నారని భారతి విద్యాపీఠ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్‌ జితేంద్ర ఓస్వాల్ వెల్లడించారు. నెలరోజుల తరవాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు. మరికొంతమందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్ సంస్థ..ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆ సంస్థ భారత్‌తో దాని భద్రతను పరిశీలిస్తోంది.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?