Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..

మీ మొబైల్ నెంబర్‌ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మార్చాలని అనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు.

గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2020 | 4:02 PM

Prepaid To Postpaid Mobile Connection: మీ మొబైల్ నెంబర్‌ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మార్చాలని అనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. గతంలో అయితే సంబంధిత నెట్‌వర్క్ ఆఫీస్‌కు వెళ్లి ఫామ్ ఫిల్ చేయడం, ఆ తర్వాత వారు దాన్ని వెరిఫికేషన్ చేస్తారు. అప్పుడే సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఇక త్వరలోనే ఈ లాంగ్ ప్రాసెస్‌కు టెలికాం డిపార్ట్‌మెంట్‌ స్వస్తి పలకనుంది.

కేవలం ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు సిమ్ మారేలా కొత్త గైడ్ లైన్స్‌ను టెలికాం డిపార్ట్‌మెంట్ రూపొందిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కస్టమర్లు తమ అడ్రస్ ప్రూఫ్‌ను ఏ సిమ్‌కు మారాలనుకుంటున్నారో.. సదరు కంపెనీ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తే చాలు.. కొన్ని గంటల వ్యవధిలోనే మీ సిమ్ ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ మారుతుంది. కాగా, ఈ సరికొత్త గైడ్ లైన్స్ రెండు వారాల్లో విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..