ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది.

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 19, 2020 | 4:56 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో మృతుల సంఖ్య 2906కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 1123, చిత్తూరులో 830, తూర్పు గోదావరిలో 1399, గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794, నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖలో 835, విజయనగరంలో 428, పశ్చిమ గోదావరిలో 919 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

Also Read:

Breaking: మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

ఇంటర్‌లో డిస్టింక్షన్ వచ్చిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు..