AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 3,342 కరోనా కేసులు, 22 మరణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,342 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,04,026కి చేరింది.

ఏపీలో కొత్తగా 3,342 కరోనా కేసులు, 22 మరణాలు..
Ravi Kiran
|

Updated on: Oct 24, 2020 | 6:13 PM

Share

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,342 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,04,026కి చేరింది. ఇందులో 31,469 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,65,991 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 22 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,566కు చేరుకుంది. ఇక నిన్న 3,572 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 131, చిత్తూరు 404, తూర్పుగోదావరి 445, గుంటూరు 378, కడప 203, కృష్ణా 344, కర్నూలు 60, నెల్లూరు 98, ప్రకాశం 266, శ్రీకాకుళం 112, విశాఖపట్నం 244, విజయనగరం 106, పశ్చిమ గోదావరి 551 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,106కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 760 మంది కరోనాతో మరణించారు.

Follow Us