ఏపీలో ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2020 | 6:54 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. వీటిల్లో 69,252 యాక్టివ్ కేసులు ఉండగా.. 60,024 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1281కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 4,618 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 68 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇక అత్యధిక పాజిటివ్ కేసులు(1441) తూర్పుగోదావరి జిల్లాలో నమోదు కాగా.. ఆ తర్వాత కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కేసులు, పశ్చిమ గోదావరిలో 998 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 954, చిత్తూర్ 509, గుంటూరు 946, కడప 753, కృష్ణ 271, నెల్లూరు 702, ప్రకాశం 318, శ్రీకాకుళం 586, విజయనగరంలో 214 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 19,180 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 187 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం