ఐపీఎల్ ఫైనల్ నవంబర్ 10వ తేదీకి మార్పు..!
ముందుగా అనుకున్నట్లు ఐపీఎల్ 2020 ఫైనల్ నవంబర్ 8న జరిగే అవకాశాలు కనిపించట్లేదు. స్టాక్ హోల్డర్స్, బ్రాడ్‌కాస్టర్ల విజ్ఞప్తి మేరకు నవంబర్ 10న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచిస్తోంది.

IPL 2020 final likely to be postponed: ముందుగా అనుకున్నట్లు ఐపీఎల్ 2020 ఫైనల్ నవంబర్ 8న జరిగే అవకాశాలు కనిపించట్లేదు. స్టాక్ హోల్డర్స్, బ్రాడ్‌కాస్టర్ల విజ్ఞప్తి మేరకు నవంబర్ 10న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మరో మూడు రోజుల్లో వెలువడనుంది. ముఖ్యంగా ‘స్టార్ ఇండియా’ కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ షెడ్యూల్ పొడిగింపు ఆస్ట్రేలియా టూర్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఐపీఎల్ ఫైనల్ గనక రెండు రోజులు వాయిదా పడితే.. భారత్ జట్టు యూఏఈ నుంచి సరాసరి ఆస్ట్రేలియా బయల్దేరాల్సి ఉంటుంది. కాగా, ఐపీఎల్ టోర్నీ యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుందని చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. ఇక లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది జట్లు ఆగష్టు 20 కల్లా యూఏఈకి చేరుకోనున్నాయి. అటు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు ఛార్టెడ్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్ ఏర్పాట్లును ముమ్మరం చేస్తున్నాయి.
Also Read:
అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..
హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!
మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!




