హైదరాబాద్‌లో కంటే.. ఆ మున్సిపాలిటీలోనే ఎక్కువగా కంటైన్మెంట్ జోన్లు..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో వేగంగా విస్తరిస్తోంది.
Mahabubunagar municipality : కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ సహా వైరస్ ప్రభావం ఎక్కువగా గల ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. గురువారం తెలంగాణ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 92 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అత్యధికంగా చార్మినార్ జోన్లో 31 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. సికింద్రాబాద్‌లో 23 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
మరోవైపు.. జిల్లాల వారీగా కంటైన్మెంట్ జోన్లను పరిశీలిస్తే.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో హైదరాబాద్ కంటే ఎక్కువగా 127 జోన్లు ఉండటం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో గత వారం రోజుల్లో 229 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాలతో పోలిస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. కానీ పట్టణంలో ఎక్కువ కేసులు నమోదవుతుండటం వల్ల కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి.
Read More:
గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్ పోస్టుల భర్తీ!
జీహెచ్ఎంసీలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు.. గంటకు 500 పరీక్షలు..!