అసోంలో వరదల బీభత్సం..107మంది మృతి
అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదితో సహా మరికొన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది.
అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదితో సహా మరికొన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. వరదల వల్ల ఇప్పటి వరకు 107 మంది మరణించగా, 5,305 గ్రామాలకు చెందిన 56,71,031 మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ గురువారం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలు ప్రభావితమయ్యాయి. గురువారం ఉదయం బ్రహ్మపుత్ర నది పలు ప్రాంతాల్లో డేంజర్ లెవల్‌ను ధాటి ప్రవహిస్తున్నదని అధికారులు చెప్పారు. కజిరంగా జాతీయ పార్కులో వరదల ఉధృతికి సుమారు 150కి పైగా వన్యప్రాణాలు మృతి చెందాయి.