తమిళనాడులో మరో 5,864 కరోనా పాజిటివ్ కేసులు
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆరు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆరు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తొలిసారి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,864 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,39,978కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 57,962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 97 మంది మరణించారు. ఇక కరోనా నుంచి కోలుకుని గురువారం నాడు 5,295 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5,864 new #COVID19 cases and 97 deaths reported in Tamil Nadu today, taking the total to 2,39,978 cases and 3,838 deaths till date. 5,295 patients were discharged today. 57,962 cases still active in the state: Health & Family Welfare Department, #TamilNadu pic.twitter.com/V7eZzxwsqD
— ANI (@ANI) July 30, 2020