సీపీఐ సీనియర్ నేతకు కరోనా..క్వారంటైన్‌కు అనుచరులు

దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారు వీరు అని తేడా లేకుండా ప్రతీ ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా సీపీఐ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వైరస్ బారినపడ్డారు.

సీపీఐ సీనియర్ నేతకు కరోనా..క్వారంటైన్‌కు అనుచరులు
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2020 | 7:30 PM

దేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారు వీరు అని తేడా లేకుండా ప్రతీ ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా సీపీఐ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వైరస్ బారినపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీపీఐ సీనియర్ నేత అతుల్ కుమార్ అంజాన్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అతుల్ కుమార్ అంజాన్ బారాబంకిలోని ఓ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. జూలై 22న తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అతుల్ కుమార్ అంజాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బరాబంకిలో సఫెదాబాద్‌లోని మాయో కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.