దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదు..

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆన్‌లైన్‌లో తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులు కళ్యాణోత్సవం టికెట్లను కొనుగోలు చేస్తే...

దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదు..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 30, 2020 | 7:38 PM

భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆన్‌లైన్‌లో తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులు కళ్యాణోత్సవం టికెట్లను కొనుగోలు చేస్తే ఆన్‌లైన్ లో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఇలా టికెట్లు తీసుకున్న భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, శేష వస్త్రం పంపిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో కరోనాబారిన పడ్డ అర్చకులందరూ కోలుకున్నారని తెలిపారు. చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న పెద్దజీయర్ స్వామి త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.