ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 9,996 కేసులు, 82 మంది మృతి..

ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 9,996 కేసులు, 82 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి.

Ravi Kiran

|

Aug 13, 2020 | 4:21 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 82 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2378కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,70,924కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,05,459 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 90,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 856, చిత్తూరులో 963, తూర్పు గోదావరిలో 1504, గుంటూరులో 595, కడపలో 784, కృష్ణాలో 330, కర్నూలులో 823, నెల్లూరులో 682, ప్రకాశంలో 681, శ్రీకాకుళంలో 425, విశాఖలో 931, విజయనగరంలో 569, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!

ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

 ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu