వారికి గుడ్ న్యూస్…కరోనా సంక్షోభంలోనూ జీతాలు పెంచిన సంస్థ
కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటోంది. భారీగా ఉద్యోగాలకు ఊడిపోయే ప్రమాదం ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసిన దశలో శాలరీస్ పెరుగుతాయన్న ఊసే లేదు. ఉన్న ఉద్యోగం ఉంటే చాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల్లో కోత ప్రకటించడం కూడా అందుకు ఓ కారణం. కానీ ఇంతటి సంక్షోభ సమయంలో కూడా కూడా కొన్ని కంపెనీలు జీతాలు పెంచుతున్నాయంటే గ్రేట్ అనే […]

కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటోంది. భారీగా ఉద్యోగాలకు ఊడిపోయే ప్రమాదం ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసిన దశలో శాలరీస్ పెరుగుతాయన్న ఊసే లేదు. ఉన్న ఉద్యోగం ఉంటే చాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు జీతాల్లో కోత ప్రకటించడం కూడా అందుకు ఓ కారణం. కానీ ఇంతటి సంక్షోభ సమయంలో కూడా కూడా కొన్ని కంపెనీలు జీతాలు పెంచుతున్నాయంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫ్రెంచ్ దిగ్గజ ఐటీ కంపెనీ క్యాప్ జెమినీ జీతాలు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇండియాలో తమ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం ఉద్యోగులకు 2020 ఏప్రిల్ 1 నుంచి పెంచిన శాలరీస్ వర్తిస్తాయని శుభ వార్త చెప్పింది. భారతదేశంలో క్యాప్ జెమినీలో దాదాపు 1,20,000 మంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నారు. అంటే ఇంచుమించు 84,000 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఇర మిగతా ఉద్యోగులకు జూలైలో జీతాలు పెంచనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఇక కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు రూ.10,000 క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది క్యాప్ జెమినీ. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టుల్లో పనిచేయకుండా బెంచ్‌పై ఉన్న ఎంప్లాయిస్ కు కూడా సంస్థ జీతాలను చెల్లిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి కూడా షిఫ్ట్ అలవెన్స్ ఇస్తోంది. 95 శాతం మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పదోన్నతులను జూన్‌లో ప్రకటించనుంది కంపెనీ.