గ్రామీణ ప్రాంతాల్లో లాక్​డౌన్ రూల్స్ స‌డలింపు..ఈ ప‌నులు చేసుకోవ‌చ్చు..

లాక్​డౌన్​ను మే 3 వ‌ర‌కు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఏప్రిల్ 14న ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. అనంతరం నిబంధ‌న‌లు, స‌డ‌లింపుల‌కు సంబంధించి కేంద్ర‌ హోంశాఖ కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే వాటికి మరికొన్ని అంశాలను జోడిస్తూ శుక్ర‌వారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, పారిశుద్ధ్యం పనులు, నీటి సరఫరా, విద్యుత్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:18 pm, Fri, 17 April 20
గ్రామీణ ప్రాంతాల్లో లాక్​డౌన్ రూల్స్ స‌డలింపు..ఈ ప‌నులు చేసుకోవ‌చ్చు..

లాక్​డౌన్​ను మే 3 వ‌ర‌కు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఏప్రిల్ 14న ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. అనంతరం నిబంధ‌న‌లు, స‌డ‌లింపుల‌కు సంబంధించి కేంద్ర‌ హోంశాఖ కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే వాటికి మరికొన్ని అంశాలను జోడిస్తూ శుక్ర‌వారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, పారిశుద్ధ్యం పనులు, నీటి సరఫరా, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది కేంద్రం.

ఇవి కూడా వ్యవసాయంలో భాగమే..

ట్రైబ‌ల్ ఏరియాలో జరిగే కార్యకలాపాలకు పూర్తి మినహాయింపులు వ‌ర్తించ‌నున్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణ, కలప సేకరణ, పంటల సాగు వంటివి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలను మిన‌హాయింపు జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం.

సుగంధ ద్రవ్యాలు సాగు..

వెదురు, కోకో, కొబ్బరి, సుగంధ ద్రవ్య దినుసుల సాగు, శుద్ధి చేయడం, ప్యాకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు వంటి కార్యకలాపాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

బ్యాంకింగేతర సంస్థలకు..

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార రుణ సంస్థలకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు సాగించే విత్తన‌ సంస్థలకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.