గుడ్ న్యూస్.. ఆశాజనక ఫలితాలు ఇస్తోన్న ‘ఫావిపిరవిర్’

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ 'ఫావిపిరవిర్' యాంటీ వైరల్ డ్రగ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'ఫావిపిరవిర్' డ్రగ్‌పై నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్

గుడ్ న్యూస్.. ఆశాజనక ఫలితాలు ఇస్తోన్న 'ఫావిపిరవిర్'
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2020 | 12:44 PM

Glenmark’s Favipiravir shows positive results in Phase-3 clinical trials: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ‘ఫావిపిరవిర్’ యాంటీ వైరల్ డ్రగ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఫావిపిరవిర్’ డ్రగ్‌పై నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ ఆశాజనక ఫలితాలను ఇస్తున్నట్లు గ్లెన్ మార్క్ సంస్థ ప్రకటించింది.

సాధారణ చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు కంటే 29 శాతం వేగంగా ‘ఫావిపిరవిర్’ ఇచ్చిన బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఫేజ్ -3 ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. సుమారు 150 మంది రోగులపై ఈ ట్రయిల్స్ నిర్వహించాం. వ్యాధి తీవ్రత ఆధారంగా కరోనా స్వల్ప(90 మంది రోగులు), మధ్యస్థ(60 మంది రోగులు) లక్షణాలున్న వారిని విభజించి.. 14 రోజుల పాటు ‘ఫావిపిరవిర్’ టాబ్లెట్స్ ఇచ్చాం. అందరూ కూడా చాలా వేగంగా క్యూర్ అయ్యారని గ్లెన్ మార్క్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, జూన్ 20న గ్లెన్ మార్క్ సంస్థ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో ‘ఫావిపిరవిర్’ టాబ్లెట్స్ తయారు చేసేందుకు, ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది. దీనితో అప్పటి నుంచి దేశంలో ఈ మందును కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి ఇస్తున్నారు.

Also Read:

జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..

Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…