ఘోర ప్రమాదం.. కల్వర్టను ఢీకొట్టి లారీ బోల్తా..

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తోప్పూర్ సమీపంలో అదుపుతప్పిన ఓ లారీ కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. జిల్లాలోని నల్లంపల్లి సమీపం..

ఘోర ప్రమాదం.. కల్వర్టను ఢీకొట్టి లారీ బోల్తా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 12:22 PM

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తోప్పూర్ సమీపంలో అదుపుతప్పిన ఓ లారీ కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. జిల్లాలోని నల్లంపల్లి సమీపం మేల్‌పూరికల్‌ గ్రామానికి చెందిన అరియా గౌండర్‌(60), శ్రీనివాసన్‌(53) అనే ఇద్దరు వ్యక్తులు తోప్పూర్‌లోని ఓ సంస్థలో నైట్‌ వాచ్‌మెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో విధుల్లో చేరేందుకు.. వీరిద్దరు కలిసి ఓ బైక్‌పై బయల్దేరారు.

అయితే అదే దారిలో రైల్వే పరికరాలను తిరుచ్చికి తీసుకెళ్తున్న ఓ లారీ.. తోప్పూర్‌ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న అరియాగౌండర్, శ్రీనివాసన్ బైక్‌ లారీ కింద చిక్కుకుపోయింది. ఈ ఘటనలో అరియాగౌండర్‌, శ్రీనివాసన్‌తో పాటుగా.. లారీ డ్రైవర్‌ సెల్వం, క్లీనర్‌ తంగరాజ్‌ తీవ్ర గాయాలపాలకు గురవ్వడంతో.. అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో.. లారీ కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.