2021 New Year : 2020 ఏడాదిలో సరికొత్త పదాలను నేర్పిన కరోనా.. అవెంటో మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుందామా ?..
2020 సంవత్సరంలో కంటికి కనిపించని ఓ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఆర్థికంగా ఎంతో నష్టాన్ని మూటగట్టుకునేలా చేసింది. కానీ అదే సమయంలో ఓ కొత్త జీవిత పాఠాలను
2020 సంవత్సరంలో కంటికి కనిపించని ఓ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఆర్థికంగా ఎంతో నష్టాన్ని మూటగట్టుకునేలా చేసింది. కానీ అదే సమయంలో ఓ కొత్త జీవిత పాఠాలను నేర్పింది. వాటితోపాటు కొత్త పదాలను ప్రతిరోజు జపించేలా చేసింది. కరోనా తీసుకువచ్చిన ఆ పదాలను మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందామా ?..
వర్క్ ఫ్రం హోం..
ఇంతకు ముందు చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ పదాన్ని మనం విన్నాం. ఈ వర్క్ ఫ్రం హోం అనేది కేవలం కొన్ని రంగాల వారికే ఉండేది. కానీ కరోనా పుణ్యమా అని దాదాపు అన్ని కంపెనీలు ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకు కల్పించాయి. ఇంకా చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభిస్తున్నాయి.
లాక్డౌన్.. గతంలో ఈ పదాన్ని ఎవరు అంతగా వినలేదు. దీని గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ కొవిడ్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ లాక్డౌన్ వలన దాదాపు కరోనాకు విజృంభనకు అడ్డుగట్ట వేయగలిగాం. చాలా మంది లాక్డౌన్ సమయంలో ఇళ్ళలోనే ఉండిపోగా.. దుకాణాలు, రవాణా వ్యవస్థలన్ని స్తంభించిపోయాయి.
వ్యాక్సిన్.. గడిచిన ఇన్ని ఏళ్ళల్లో ఒక వ్యాక్సిన్ కోసం ప్రజలందరు ఇంతలా ఎదురు చూసిన సంఘటనలు చాలా అరుదు. కరోనా మహమ్మారి వల్ల దాదాపు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. 18వ శతబ్ధంలో ఎడ్వర్ట్ జెన్నర్ అనే శాస్త్రవేత్త తొలి టీకాను కనుగొన్నాడు. 1798లో మశూచికి వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు జెన్నర్. ఆ తర్వాత ఎన్నో వ్యాక్సిన్లను ఎక్కువగా వాడుతున్నారు.
క్యారంటైన్.. చాలా వరకు ఈ పదాన్ని ఎవరు వినలేదు. కరోనా వైరస్ ప్రారంభదశలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. మొదట్లో క్యారంటైన్ అంటే ఎంటీ అనేది ఎవరికి తెలిసేది కాదు. కానీ కరోనా లక్షణాలు కనిపించినా.. కొవిడ్ సోకిన వారితో కలిసిన, పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోం క్యారంటైన్, క్యారంటైన్ అంటే ఇతర వ్యక్తులకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం కావడం. ఈ పదాన్ని లాటిన్ భాషలో నలభైకు అర్థం వచ్చే క్వాడ్రాగ్రినా నుంచి తీసుకున్నారు.
ఐసోలేషన్.. ప్రస్తుతం కరోనా సోకిన వారిని.. అలాగే వైరస్ సోకినట్లు అనుమానం ఉన్నవారిని హోం ఐసోలేషనల్లో ఉంచుతున్నారు. ఇది లాటిన్ పదమైన ఇన్సులా నుంచి వచ్చింది. దీని అర్థం ఐల్యాండ్ అని. ఇన్సులా ఐసోలెటో నుంచి ఫ్రెంచ్ పదమైన ఐసోల్గా మారింది. తర్వాత ఇంగ్లీష్ పదంలో ఐసోలేట్ గా మారింది. 14వ శతాబ్ధంలో ఇటలీలోని తొలి ఆసుపత్రి ఐల్యాండ్లో నిర్మించడంతో ఈ పదం జన్మించింది.
సోషల్ డిస్టెన్స్.. సోషల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం పాటించడం. గతంలో కొన్ని వర్గాల మధ్య వ్యక్తిగత దూరాన్ని పాటించడంలో ఈ పదాన్ని ఉపయోగించారు. తర్వాత కరోనా వైరస్ రావడంతో ఈ పదం మరోసారి వాడుకలోకి వచ్చింది. కరోనా నియంత్రణకు ఇది చాలా ముఖ్యం. వీటితోపాటు కరోనా కోస్టెర్, మొరోనా వైరస్, కొవిడియట్, కరోనియల్స్, ఎపిడమిక్, పాండమిక్, ఔట్ బ్రేక్, సూపర్ స్ప్రైడర్ తదితర పదాలు వాడుకలోకి వచ్చాయి.