AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కోసం 70 లక్షల మంది పేర్లు నమోదు.. ప్రత్యేక యాప్‌ ద్వారా పరిశీలన

Corona Vaccine:భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఇప్పటి వరకు 70 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ...

Corona Vaccine: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కోసం 70 లక్షల మంది పేర్లు నమోదు.. ప్రత్యేక యాప్‌ ద్వారా పరిశీలన
Subhash Goud
|

Updated on: Jan 01, 2021 | 5:02 PM

Share

Corona Vaccine: భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఇప్పటి వరకు 70 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ Co-WIN లో ఇప్పటి వరకు మొత్తం 70,33,338 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే టీకా వేసిన తర్వాత వారికి వచ్చే రియాక్షన్స్‌ను ట్రాక్‌ చేయడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. వ్యాక్సినేషన్‌ తొలి దశలో భాగంగా వీళ్లందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు కేంద్ర సర్కార్‌ గుర్తించింది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ప్రభుత్వం 2.3 లక్షల మంది వ్యాక్సినేటర్లను గుర్తించింది. అంతేకాకుండా 51 వేల ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, జనవరి 2 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ జరగనుంది. అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తలెత్త సమస్యలను, అమలు తదితర అంశాలను గుర్తించేందుకు Co-WIN యాప్‌ ద్వారా పరిశీలించనున్నారు.

Also Read:

New coronavirus strain in India: దేశంలో మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్..మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..?

Corona Cases India: దేశంలో కొత్తగా 20,035 పాజిటివ్ కేసులు, 256 మరణాలు..తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..