New coronavirus strain in India: దేశంలో మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్..మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..?

కరోనా పీడ ఇంకా పోలేదు. ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇంతలోనే స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌లు స్ట్రెయిన్ వైరస్‌ను ఎదురుకోడానికి ఎంతమేర దోహదపడుతాయి...

New coronavirus strain in India: దేశంలో మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్..మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..?
Follow us

|

Updated on: Jan 01, 2021 | 5:11 PM

కరోనా పీడ ఇంకా పోలేదు. ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇంతలోనే స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌లు స్ట్రెయిన్ వైరస్‌ను ఎదురుకోడానికి ఎంతమేర దోహదపడుతాయి అన్న అంశంపై పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. కాగా దేశంలో స్ట్రెయిన్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. కొత్తగా మరో నాలుగు స్ట్రెయిన్ వైరస్ కేసులను అధికారులు నిర్ధారించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సమయంలో..ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో మొత్తం 10 ల్యాబ్‌లకు గాను ఆరు ల్యాబ్‌లలో టెస్టుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కొత్తగా వెలుగు చూసిన ఈ నాలుగు కేసుల్లో మూడు బెంగళూరులో కాగా.. ఒకటి హైదరాబాద్‌లో వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్​సీడీసీలో 8, ఐజీఐబీలో 2, కల్యాణీ(కోల్​కతా) ఎన్​ఐబీఎంజీలో 1, పుణె ఎన్​ఐవీలో 5, హైదరాబాద్ సీసీఎంబీలో 3, బెంగళూరు నిమ్హాన్స్​లో 10 నమూనాలు కొత్త వైరస్​కు పాజిటివ్​గా తేలినట్లు వైద్య శాఖ వివరించింది.

బ్రిటన్‌లో స్ట్రెయిన్‌ ప్రభలడంతో వెంటనే అలర్టైన ఇండియా.. ఆ దేశం నుంచి నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 23 మధ్య 33వేల మంది వచ్చినట్టు గుర్తించింది. వారికి ఆర్టీ-పీసీఆర్‌  పరీక్షలు నిర్వహించగా.. కొందరికి కరోనా పాజిటివ్‌గా అని నిర్ధారణ అయ్యింది. వీరిలో కొత్త రకం కరోనా (స్ట్రెయిన్‌) ఇప్పటివరకు  29 మంది ఉన్నట్టు తదుపరి పరీక్షల్లో తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read : 

Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్

Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్..’సింహాద్రి అప్పన్న’ సాక్షిగా తేల్చుకుందాం అంటూ ట్వీట్

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన