బుట్టబొమ్మకు బంపరాఫర్.. దెబ్బకు మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్

TV9 Telugu

18 May 2024

తన అందం, అభినయంతో తెలుగుతో సహా దక్షిణాది భాషా సినిమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బుట్టు బొమ్మ పూజా హెగ్డే.

పూజా  కెరీర్ లో అల వైకుంఠపురం, మహర్షి, అరవింద సమేత తదితర ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి

ఒకానొక సమయంలో  లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న పూజా వరుస  ఫ్లాప్స్ తో  పూర్తిగా డీలా పడిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ ఖతం అని కూడా అనుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పూజా పాపకు ఒక బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో హీరోయిన్ గా ఈమెకు ఛాన్స్ వచ్చిందట.

సూర్య ప్రస్తుతం 'కంగువ' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. 

సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.

ఇప్పుడీ సినిమాలో పూజా హెగ్డేకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని సమాచారం. దీంతో ఈ అమ్మడి ఆనందానికి హద్దుల్లేవట.

సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం పూజకు మళ్లీ స్టార్ హీరోయిన్ స్టేటస్ రావొచ్చు.