AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు.. హెచ్‌డీఎఫ్సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డు.. ఫీచర్లు మామూలుగా లేవు..

సాధారణంగా ఒక క్రెడిట్ కార్డులపై పరిమితిని వినియోగదారు వాడుకుంటారు. అది మాత్రమే కస్టమర్ చేతుల్లో ఉంటుంది. ఆ కార్డు బిల్లింగ్ సైకిల్, రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు ఎంత ఇవ్వాలో బ్యాంకులే నిర్ణయిస్తాయి. వీటిని కస్టమర్లు నిర్ణయించలేరు. అయితే హెచ్డీఎఫ్సీ ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టింది. కస్టమర్లే తమ బిల్లింగ్ సైకిల్ తో పాటు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ కావాలో వద్దో నిర్ణయించుకునే అవకాశాన్ని అందిస్తోంది.

Credit Card: బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు.. హెచ్‌డీఎఫ్సీ నుంచి కొత్త క్రెడిట్ కార్డు.. ఫీచర్లు మామూలుగా లేవు..
Hdfc New Credit Card
Madhu
|

Updated on: May 19, 2024 | 6:57 AM

Share

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించి షాపింగ్ చేయడం, ఇంట్లో పవర్ బిల్లులు, టీవీ బిల్లులు, వాహనాల్లో పెట్రోల్ కొట్టించడం వంటివి చేస్తున్నారు. తద్వారా క్రెడిట్ కార్డు సంస్థలు ఇచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు, తగ్గింపు ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి మార్కెట్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తోంది. ఫలితంగా అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులపై పలు ఆఫర్లను ప్రకటించడమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ప్రైవేటు రుణదాత అయిన హెచ్‌డీఎఫ్సీ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ అందించింది. సాధారణంగా ఒక క్రెడిట్ కార్డులపై పరిమితిని వినియోగదారు వాడుకుంటారు. అది మాత్రమే కస్టమర్ చేతుల్లో ఉంటుంది. ఆ కార్డు బిల్లింగ్ సైకిల్, రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు ఎంత ఇవ్వాలో బ్యాంకులే నిర్ణయిస్తాయి. వీటిని కస్టమర్లు నిర్ణయించలేరు. అయితే హెచ్డీఎఫ్సీ ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టింది. కస్టమర్లే తమ బిల్లింగ్ సైకిల్ తో పాటు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ కావాలో వద్దో నిర్ణయించుకునే అవకాశాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కస్టమర్లే నిర్ణేతలు..

హెచ్డీఎఫ్సీ బ్యాంకు తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవల ఓ క్రెడిట్ కార్డును హెచ్డీఎఫ్షీ బ్యాంకు తీసుకొచ్చింది. ఈ కార్డు కలిగిన వినియోగదారులు బిల్లింగ్ సైకిల్, రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్‌ని నిర్ణయించగలిగే అధికారాన్ని కలిగి ఉంటారు.

కార్డు పేరు ఏంటంటే..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ కంట్రీ హెడ్ పరాగ్ రావ్ జీ మాట్లాడుతూ ఈ కొత్త క్రెడిట్ కార్డు పేరు పిక్సెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పారు. ఇది డిజిటల్ క్రెడిట్ కార్డ్ యాప్ ద్వారా పనిచేస్తుందని వివరించారు. యువతే లక్ష్యంగా ఆకర్షించేందుకే డిజిటల్ కార్డును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం వీసా నెట్ వర్క్ లో మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉందని.. త్వరలోనే ఇతర నెట్ వర్క్ లలో కూడా అందుబాటులోకి వస్తుందని రావు స్పష్టం చేశారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్ వారి బిల్లింగ్ సైకిల్‌ను నిర్ణయించుకోవడంతో పాటు వారు పొందే క్యాష్‌బ్యాక్‌ను, రివార్డు పాయింట్లను ఎంచుకోవడం కూడా ఈ కార్డు ప్రత్యేకత అని ఆయన అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..