SBI FDs interest rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. రూ. లక్ష పెడితే ఎంత వస్తుందంటే..

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన స్వల్పకాలిక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. మే నెల 15వ తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రేట్లు 25 బీపీఎస్ నుంచి 75 బీపీఎస్ వరకూ పెరిగాయి. ఇవి సాధారణ ఖాతాదారులతో పాటు సీనియర్ సిటిజన్ల కూ వర్తిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SBI FDs interest rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. రూ. లక్ష పెడితే ఎంత వస్తుందంటే..
Fd
Follow us

|

Updated on: May 19, 2024 | 7:23 AM

ప్రజలు తమ డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు ఫిక్స్ డ్ డిపాజిట్లనే (ఎఫ్‌డీలు) ఎక్కువగా నమ్ముతారు. వివిధ బ్యాంకులు అందించే ఈ ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టి, నిర్థిష్ట సమాయానికి పెట్టుబడితో వడ్డీని కలిపి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. బ్యాంకులు కూడా వారికి ఎక్కువ వడ్డీని అందిస్తుంటాయి. అయితే అన్ని బ్యాంకులలో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు ఒకేలా ఉండవు. వాటినన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇటీవల ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను బ్యాంకులు సవరించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఎఫ్‌డీల రేట్లను మార్చింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంకులోని ఎఫ్డీ ఫథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం ఎంత సొమ్ము వస్తుందో తెలుసుకుందాం.

ఎస్బీఐ సవరించిన వడ్డీరేట్లు..

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన స్వల్పకాలిక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. మే నెల 15వ తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. రేట్లు 25 బీపీఎస్ నుంచి 75 బీపీఎస్ వరకూ పెరిగాయి. ఇవి సాధారణ ఖాతాదారులతో పాటు సీనియర్ సిటిజన్ల కూ వర్తిస్తాయి.

పెరిగిన వడ్డీరేట్ల వివరాలు

  • 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.75 నుంచి 5.50 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ కేటగిరీలో 5.25 నుంచి 6 శాతానికి పెంచారు.
  • 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 5.75 శాతం నుంచి 6 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 5.25 నుంచి 6.50 శాతానికి పెంచారు.
  • 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాలపరిమితి కల ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు వడ్డీరేటును 6 శాతం నుంచి 6.25కు పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం నుంచి 6.75 శాతం పెంపుదల చేసింది.
  • వివిధ ఎఫ్ డీ పథకాలలో రూ.లక్ష పెట్టుబడి పెడితే సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం మెచ్యూరిటీ తర్వాత ఎంత సొమ్ము వస్తుందో తెలుసుకుందాం. ఊహిస్తున్నాము.

సాధారణ పౌరులకు..

  • 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్డీలో సవరించిన వడ్డీ రేటు 5.50 శాతం లభిస్తుంది. 179 రోజుల మెచ్యూరిటీలో తమ రూ. 1 లక్ష పెట్టుబడిని ఉపసంహరించుకుంటే, వారు రూ. 2,715 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ మొత్తం రూ. 1,02,715 అవుతుంది.
  • 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్ డీలో 6 శాతం వడ్డీ రేటు ఇస్తారు. అంటే రూ.1 లక్ష పెట్టుబడి పెడితే వడ్డీ రూ. 3,485 వస్తుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం రూ.1,03,485 అవుతుంది.
  • 211 రోజుల నుంచి ఏడాది లోపు పెట్టుబడిలకు ఇచ్చే వడ్డీరేటు 6.25 శాతంగా ఉంది. ఈ పథకంలో రూ. 1 లక్ష పెట్టుబడికి రూ. 6,398 వడ్డీని అందజేస్తారు. మెచ్యూరిటీ అనంతరం రూ. 1,06,398 అందుతుంది.

సీనియర్ సిటిజన్ల కోసం..

  • 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్ డీలో సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ ఇస్తారు. 179 రోజుల తర్వాత వారు పెట్టుబడిని ఉపసంహరించుకుంటే వడ్డీతో కలిపి రూ.1,02,963 అవుతుంది.
  • 180 రోజుల నుంచి 210 రోజులకు సంబంధించి సవరించిన రేట్ ప్రకారం 6.50 శాతం వడ్డీ ఇస్తారు. రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం వడ్డీతో కలిపి రూ. 1,03,779 అందుతుంది.
  • 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ ఎఫ్ డీలకూ ప్రకటించిన 6.50 శాతం ప్రకారం రూ. 6,641 వడ్డీని అందుతుంది. మెచ్యూరిటీ విలువ రూ. 1,06,641 అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!