AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Tips: వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..

లెజెండరీ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ తన ఉపన్యాసాలు, ప్రసంగాలలో పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలు చెబుతారు. తన కంపెనీ  షేర్‌ హోల్డర్లతో తరచూ అనుభావాలను పంచుకుంటున్నారు. పెట్టుబడి, డబ్బుకు సంబంధించి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఐదు అంశాలను తెలుసుకుందాం.

Business Tips: వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
Business Idea
Madhu
|

Updated on: May 19, 2024 | 8:22 AM

Share

జీవితంలో ముందుకు సాగాలంటే ఆర్థిక స్థిరత్వం అనేది చాలా అవసరం. దాని సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ పథకాలలో డబ్బులు పెట్టి లాభాలను పొందవచ్చు. వాటిలో స్టాక్ మార్కెట్ అత్యంత ప్రముఖమైంది. ఎక్కువ మంది దీనిలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే మనం కష్టబడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టే ముందు అనేక అంశాలను పరిశీలించాలి. తొందర పడి నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో లాభంతో పాటు నష్టాలు వచ్చే అవకాశం కూాడా ఎక్కువగా ఉంటుంది.

వారన్ బఫెట్ మాటలివి..

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వారన్ బఫెట్ పెట్టుబడులు పెట్టడంతో సిద్ధహస్తుడు. ఆయన ఆర్థిక ప్రణాళిక చాలా కచ్చితంగా ఉంటుంది. వ్యాపారంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. విజయవంతమైన పెట్టుబడిదారుడిగా ఆయన పేరుగడించారు. లెజెండరీ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ తన ఉపన్యాసాలు, ప్రసంగాలలో పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలు చెబుతారు. తన కంపెనీ  షేర్‌ హోల్డర్లతో తరచూ అనుభావాలను పంచుకుంటున్నారు. పెట్టుబడి, డబ్బుకు సంబంధించి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఐదు అంశాలను తెలుసుకుందాం.

పరిశోధన.. పెట్టుబడి మార్గాలకు సంబంధించి సొంత పరిశోధన చేయాలి. ముఖ్యంగా ఆర్థిక నివేదికలను ఎక్కువగా చదవడం వల్ల అవగాహన పెరుగుతుంది. కొనుగోలు చేసిన స్టాక్ లను తరచూ విక్రయించ కూడదు.

పెట్టుబడి.. స్టాక్ మార్కట్లోని లాభాల ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి అందరూ ఇష్టపడతారు. వాటిలో పాటు నష్టాలలో ఉన్న కంపెనీలను కూడా పరిశీలించాలి. భవిష్యత్తులో వాటి షేర్లు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా పరిశీలన అనేది పెట్టుబడి దారులకు చాాలా అవసరం. ఇలాంటి కంపెనీల స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే నేర్పు ఉండాలి.

నియమాలు.. కంపెనీలలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. అయితే వాటికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉంటాయి. పెట్టుబడిదారులు వాటికి కట్టుబడి ఉండాలి. పెట్టుబడి పెట్టే విషయంలో మనల్ని కొందరు అనవసరంగా కంగారు పడతారు. వారిని పట్టించుకోకుండా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి.

ప్రశ్నించడం.. పెట్టుబడిదారులకు ప్రశ్నించడం అనేది చాలా అవసరం. స్టాక్ లలో పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన ప్రశ్నలు అడగడం చాలా అవసరం. అప్పుడు ఆ షేర్లపై మీకు స్పష్టత వస్తుంది. దాని ద్వారా మీకు మెరుగైన పెట్టుబడి మార్గాలు దొరుకుతాయి.

ఆలోచన.. స్టాక్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. దీనిపై అనవసరంగా ఆందోళనకు గురికాకూడదు. లేనిపోని కంగారు పడకూడదు. మార్కెట్ తీరుతెన్నులను ప్రశాంతంగా పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..