ఆల్రెడీ ఒక యువతిని పెళ్లాడి పరలోకానికి పంపించాడు, ఇప్పుడు రెండో ఆమె. వికారాబాద్ జిల్లాలో కసాయి భర్త జావీద్ అకృత్యం

ఆల్రెడీ ఒక యువతిని పెళ్లాడి ఆమెను పరలోకానికి పంపించాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కించి బయటకొచ్చాడు. ఇకిప్పుడు మరో..

ఆల్రెడీ ఒక యువతిని పెళ్లాడి పరలోకానికి పంపించాడు, ఇప్పుడు రెండో ఆమె. వికారాబాద్ జిల్లాలో కసాయి భర్త జావీద్ అకృత్యం
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 01, 2021 | 5:01 PM

ఆల్రెడీ ఒక యువతిని పెళ్లాడి ఆమెను పరలోకానికి పంపించాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కించి బయటకొచ్చాడు. ఇకిప్పుడు మరో యువతిని వివాహమాడి ఈమెనూ పొట్టనబెట్టుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తప్పుచేసిందనే అనుమానంతో భార్యను కొట్టి చంపాడు కసాయి భర్త. వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన బిడ్డను ఆమె భర్త తరచూ వేధింపులకు గురిచేసేవాడని మృతురాలి బంధువులు, పిల్లలు ఆరోపిస్తున్నారు. కేవలం అనుమానంతోనే భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. వికారాబాద్ మండలం రాళ్ల చిట్టెంపల్లి కి గ్రామానికి చెందిన రిజ్వానాను ఇదే మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన జావీద్ పదిహేను సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి ముగ్గురు సంతానం. అయితే, ఇప్పుడు భార్య పై అనుమానంతో తరచూ తాగి గొడవ పడేవాడు, అడ్డు వచ్చిన పిల్లల పై విచక్షణ రహితంగా దాడి చేసేవాడు. చివరికి ప్రాణాలు తీశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.