కూకట్‌పల్లిలో కరోనా టెస్టులు ప్రారంభం
జీహెచ్ఎంసీతో పాటు పరిసర జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.ఇవాళ కూకట్‌పల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీతో పాటు పరిసర జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కరోనా లక్షణాలు ఉన్న 50 వేల మందికి కొవిడ్ – 19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కరోనా టెస్టులు ప్రారంభమయ్యాయి. కరోనా లక్షణాలు, ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వ్యక్తుల వద్ద నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు. ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడే వ్యక్తులు కూకట్‌పల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో టెస్టు చేయించుకోవచ్చని అధికారులు సూచించారు. కరోనా సోకిన వ్యక్తులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.