AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ అలర్ట్…ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్..

కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో కూడా రోజురోజుకు వ్యాప్తి పెంచుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు అత్యంత జాగ్రత్తలు అవసరం. లేదంటే దేశం ఉనికే  ప్రమాదంలో పడే దశలో ఉంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం ప్రజలు స్వచ్చందంగా గృహ నిర్భందంలోనే ఉండిపోయారు. అభినందించదగ్గ విషయం. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల బాల్కనీలోకి వచ్చ చప్పట్లు కొడుతూ, సౌండ్స్ చేస్తూ కరోనాపై వీరోచితంగా పోరాడుతోన్న డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు, శానిటరీ సిబ్బందికి,  క్విక్ […]

బీ అలర్ట్...ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్..
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2020 | 2:57 PM

Share

కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇండియాలో కూడా రోజురోజుకు వ్యాప్తి పెంచుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు అత్యంత జాగ్రత్తలు అవసరం. లేదంటే దేశం ఉనికే  ప్రమాదంలో పడే దశలో ఉంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం ప్రజలు స్వచ్చందంగా గృహ నిర్భందంలోనే ఉండిపోయారు. అభినందించదగ్గ విషయం. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల బాల్కనీలోకి వచ్చ చప్పట్లు కొడుతూ, సౌండ్స్ చేస్తూ కరోనాపై వీరోచితంగా పోరాడుతోన్న డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు, శానిటరీ సిబ్బందికి,  క్విక్ రెస్పాండర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరో గొప్ప విషయం. ఇంతవరకు బాగుంది. రాత్రి 9 కాగానే ఏదో దేశాన్ని కరోనా నుంచి విముక్తి చేసినట్టు రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకోవడం గర్హనీయం. కనీస అవగాహన లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటించడం పోయి గుంపులు, గుంపులుగా…అదేదో జాతరకు, తిరునాళ్లుకు వెళ్లినట్టు బిహేవ్ చేశారు కొందరు. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. మన కోసం డాక్టరు, పోలీసులు, శానిటరీ సిబ్బంది యోదుల్లా పోరాడుతుంటే…ఇంట్లో తిని, కూర్చోడానికి ఇబ్బందిపడుతున్నారు కొందరు జనాలు.

దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు ఇంతలా పిలుపునిస్తుంటే..కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఇది రాజకీయాలకు అనుమైన సమయమేనా..?  ఒక్కసారి మీ మనసుపెట్టి ఆలోచించండి. సీఎంలు జగన్, కేసీఆర్‌లు.. కరోనాకు పారాసిటమాల్ మెడిసిన్  అన్నారని..ప్రధానికి చప్పట్లు కొట్టమనడం తప్ప ఇంకేం చేతకాదని హేయమైన కామెంట్లు పెట్టారు. అసలు మనుషులు ఉనికికే ప్రమాదం వచ్చి పడిన సమయంలో పైత్యం ప్రదర్శించి కొందరు చేస్తోన్న అతికి..ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కరోజుతో ముగిసే ప్రమాదం కాదు. అవిర్వామ పోరాటం చేయాలి. దాంట్లో మీరు ఇంట్లో కూర్చోని ప్రేక్షకపాత్ర వహిస్తే చాలు. మిగిలిన యుద్దాన్ని ప్రభుత్వాలు, డాక్టర్లు చేస్తారు. ఒక్కరోజు ముగిసిందో లేదో మళ్లీ యధావిధిగా సోమవారం ఉదయాన్నే అందరూ రోడ్లపైకి వచ్చారు. ఇది విధులకు వెళ్లిన పోలీసులకు, మీడియా ప్రతినిధులకు తీవ్ర విస్మయానికి గురిచేసింది. దీనిపై ప్రధాని సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం కోసం, అందరి కోసం, దేశం కోసం లాక్‌డౌన్ పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇది ఒకరు బలవంతంగా చెప్పే సమయం కాదు..నీకు నువ్వు పరిధి తెలుసుకోవాల్సిన సమయం. మనం ఇప్పుడు వార్ జోన్‌లో ఉన్నాం.  బీ అలర్ట్..ప్రొటక్ట్ యువర్‌సెల్ఫ్.