Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా...

Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!
Telangana Corona
Follow us

|

Updated on: May 14, 2021 | 8:00 PM

Corona Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు నిర్వహించగా 4305 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 6361 మంది కోలుకోగా, 29 మంది మరణించారు. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 2896కి చేరింది.

అలాగే ఇప్పటివరకు 5,20709 మంది కరోనా బారిన పడగా.. 4,62,981 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 607, మల్కాజ్‌గిరిలో 291, రంగారెడ్డి జిల్లాలో 293, కరీంనగర్ 229, ఖమ్మం 220, నల్గొండ 246, సిద్దిపేట 129, వికారాబాద్ 158 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,39,52,378 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Latest Articles