Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ల అసహనం.. సంస్థాగత ఉనికి ప్రశ్నార్థకమన్న చిదంబరం.. స్థాయికి మించి పోటీ తగదని వ్యాఖ్య

మూలిగే నక్కపై తాటి పండు పడట్లుగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస అపజయాలు మూట గట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠానంపై సీనియర్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ల అసహనం.. సంస్థాగత ఉనికి ప్రశ్నార్థకమన్న చిదంబరం.. స్థాయికి మించి పోటీ తగదని వ్యాఖ్య
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 19, 2020 | 5:32 PM

మూలిగే నక్కపై తాటి పండు పడట్లుగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస అపజయాలు మూట గట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠానంపై సీనియర్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగులేదని, పార్టీ సంస్థాగతంగా ఉనికిని కోల్పోతుందని, పార్టీ గణనీయంగా బలహీన పడుతున్న అంశాలను ఇటీవల జరిగిన ఎన్నికలు రుజువు చేస్తున్నాయని చిదంబర్ ఆవేదన వ్యక్తం చేశార.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘరో పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లను మాత్రమే సాధించింది. అలాగే యూపీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘరో పరభావాన్ని మూటగట్టుకుంది. దీంతో సీనియర్ నేతల్లో అక్రోశం మెల్లమెల్లగా బయటపడుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయంలోనే చిదంబరం ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మామూలుగా పార్టీపై వచ్చే విమర్శలకు ఆయన దీటుగా బదులిస్తుంటారు. కానీ, ప్రస్తుత స్పందన దానికి భిన్నంగా ఉండటంతో రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది.

‘గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నన్ను మరింత ఆందోళనకు గురి చేశాయి. పార్టీ సంస్థాగత ఉనికి, గణనీయంగా బలహీన పడుతున్న విషయాన్ని ఆ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్‌కు గెలిచే అవకాశం ఉంది. విజయానికి దగ్గరగా ఉండీ ఎందుకు ఓడిపోయామనే అంశంపై సమీక్ష అవసరమన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించి ఎంతో కాలం కాలేదు. ఏఐఎంఐఎం, సీపీఐ-ఎంఎల్ వంటి చిన్న పార్టీలు సైతం బిహార్ ఎన్నికల్లో గొప్ప పనితీరును ప్రదర్శించాయి. తాజా ఎన్నికల ఫలితాలు సంస్థాగత స్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందని చిదంబరం ఘాటుగా స్పందించారు. ఇక త్వరలో ఎన్నికలు జరుగబోయే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోంలో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దామంటూ నిరాశగా స్పందించారు చిదంబరం.