మూసీ నది ప్రక్షాళనపై ఉపరాష్ట్రపతితో కోమటిరెడ్డి భేటీ
మూసీనదిని పరిరక్షించాలని.. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు […]
మూసీనదిని పరిరక్షించాలని.. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కలుషితమయిన నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్‌లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.