APSRTC: ‘చలో’ యాప్.. ఇక ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్

APSRTC: ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్ ప్రభుత్వ బస్సుల్లో నగదు రహిత సేవలను ప్రారంభించింది. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలట్ ప్రాజెక్టును విజయవాడ ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండి మడిరెడ్డి ప్రతాప్ ఈ యాప్ ద్వారా బస్సు ఛార్జీలు చెల్లించడం కోసం చలో మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. 2.5 లక్షల మంది ప్రయాణికులకు చలో యాప్ ఉపయోగపడుతుంది. ఆర్టీసీ చలో యాప్‌తో […]

APSRTC: 'చలో' యాప్.. ఇక ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 19, 2020 | 7:48 PM

APSRTC: ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్ ప్రభుత్వ బస్సుల్లో నగదు రహిత సేవలను ప్రారంభించింది. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి పైలట్ ప్రాజెక్టును విజయవాడ ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండి మడిరెడ్డి ప్రతాప్ ఈ యాప్ ద్వారా బస్సు ఛార్జీలు చెల్లించడం కోసం చలో మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.

2.5 లక్షల మంది ప్రయాణికులకు చలో యాప్ ఉపయోగపడుతుంది. ఆర్టీసీ చలో యాప్‌తో పాటు స్మార్ట్ కార్డులను కూడా అందుబాటులోకి తెచ్చింది. టిమ్ మిషన్ ద్వారా స్మార్ట్ కార్డులను ఉపయోగించవచ్చని ఆర్టీసీ ఎండి ప్రతాప్ తెలిపారు. ఎమ్‌డి ప్రతాప్ చలో యాప్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. ఇది సిబ్బందికి సమయాన్ని ఆదా చేస్తుందని, ప్రజా రవాణాను ఎంచుకునే వారికి, వ్యాపారులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలిపారు.