TTD: శ్రీవారి భక్తులకు.. కళ్యాణం లడ్డు, వడ ప్రసాదాలు!

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన కల్యాణం లడ్డూను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 20నుంచి వడ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు. వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. గురువారం నుంచి భక్తులకు […]

TTD: శ్రీవారి భక్తులకు.. కళ్యాణం లడ్డు, వడ ప్రసాదాలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 19, 2020 | 9:49 PM

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన కల్యాణం లడ్డూను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 20నుంచి వడ ప్రసాదాన్ని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ తెలిపారు. వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. గురువారం నుంచి భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి తీసుకురానున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం సుమారు 10 వేల కల్యాణం లడ్డూలు, 10 వేల వడ ప్రసాదం అందించేందుకు సమాయత్తం అవుతోందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను సామాన్యులకూ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి సిఫార్సు లేఖలు అవసరం లేకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించింది. చిన్న లడ్డూతో పాటు కల్యాణోత్సవ లడ్డూను విక్రయిస్తున్నారు. దీని ధరను రూ.200గా నిర్ణయించారు.