పవన్ కోసం బిగ్ బోట్ సెట్ వేయనున్న క్రిష్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ఎంత బజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈయన్ని దేవుడిలా కొలుస్తారు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ఎంత బజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈయన్ని దేవుడిలా కొలుస్తారు.. ఫ్యాన్స్. అంత ఇమేజ్ ఉంది ఆయనకి. దీంతో ఆయన ఏం చేసినా ఓ సెన్సేషనే అవుతుంది. ఇప్పటికే ‘పింక్ రీమేక్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన క్రిష్‌తో ఓ పీరియాడికల్ చిత్రం చేయనున్నారనే విషయం తెలిసిందే.
ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ ఓ బిగ్ బోట్ సెటప్ వేయనున్నాడని టాక్ నడుస్తోంది. అందులోనూ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి.. ఇలాంటి కనిపించడం సర్వ సాధారణం. ఇందులో ప్రత్యేకంగా ఓ ఫైట్ సీన్‌ని క్రిష్ తీయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి ‘విరూపాక్షి’ అన్న టైటిల్‌ను కూడా ఫైనల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ భూమిక చావ్లా అనే వార్త కూడా జోరుగా వైరల్ అవుతోంది. ఏదేమైనా.. ఈ సినిమా సెట్స్ మీదకెళ్లంతవరకూ ఏవో ఒక వార్లు ఇలా ట్రోల్ అవుతూనే ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారట క్రిష్.