Anchor Rashmi: వ్యవసాయంపై ఆసక్తి.. వంద ఎకరాల భూమిని కొన్న రష్మి..?

తెలుగు బుల్లితెర మీద దుమ్ములేపుతోన్న యాంకర్లలో రష్మి ఒకరు. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన ముద్దు ముద్దు చేష్టలతో

Anchor Rashmi: వ్యవసాయంపై ఆసక్తి.. వంద ఎకరాల భూమిని కొన్న రష్మి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 20, 2020 | 9:14 AM

Anchor Rashmi: తెలుగు బుల్లితెర మీద దుమ్ములేపుతోన్న యాంకర్లలో రష్మి ఒకరు. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన ముద్దు ముద్దు చేష్టలతో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది రష్మి. కెరీర్ ప్రారంభంలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ యాంకర్.. ఇప్పుడు వరుస షోలతో బాగానే సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో తను సంపాదించిన డబ్బుతో రష్మి ఒడిశాలో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం దాదాపు రూ.5కోట్లకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ భూముల్లో కోకా, యూకలిప్టస్‌ చెట్లను పండించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో జన్మించిన రష్మి.. ఆ తరువాత వైజాగ్‌లో పెరిగింది. ప్రస్తుతం తెలుగులో యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్నా రష్మి.. సొంతూరులో భూములు కొన్నదన్న వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా గానీ ఏవైనా రూమర్లు వచ్చినప్పడు రష్మి స్పందిస్తూ ఉంటుంది. మరి అలాంటి క్రమంలో ఈ వంద ఎకరాల భూమి కొనుగోలు వార్తలపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read This Story Also:వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వైవీ సమక్షంలో.. తోటపై చెప్పుతో దాడి