మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు

మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 23, 2020 | 11:34 AM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేష్‌ బాబు నటించబోతున్నారట.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ డేట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాత్రను తాను కాకుండా మరో హీరోతో చేయించాలని చెర్రీ భావిస్తున్నారట. ఈ క్రమంలో రామ్ చరణ్ మనసులో మహేష్ మెదిలారట. ఈ విషయాన్ని దర్శకుడికి కూాడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇటీవల కొరటాల శివ, మహేష్‌ను కలిసి పాత్ర గురించి చెప్పినట్లు టాక్. ఇక కొరటాలతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ పాత్రలో నటించేందుకు మహేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మెగాస్టార్ కుటుంబంతో మహేష్‌‌‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్‌, మహేష్‌ ఎప్పటినుంచో మంచి మిత్రులు. కుటుంబపరంగానూ వీరిద్దరు పలు అకేషన్లలో కలుసుకుంటూ ఉంటారు. ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరై.. అతడికి తన బ్లెస్సింగ్స్‌ను ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ముగ్గురు హీరోలతో విదేశీ టూర్‌కు వెళ్లాల్సి వస్తే ఎవ్వరితో వెళ్తారు అన్న ప్రశ్నకు చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ పేర్లు చెప్పారు మహేష్ బాబు. ఇలా మెగాస్టార్‌ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ దృష్ట్యా  ఇప్పుడు చిరు సినిమాలో నటించేందుకు మహేష్ కూడా ఒప్పుకున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సినిమాకు సూపర్‌స్టార్ మరో అదనపు ఆకర్షణ అవుతారనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అలాగే ఇరు వర్గాల ఫ్యాన్స్‌‌కు కూడా ఇది పండగ చేసుకునే వార్తనే అవుతుంది. Read This Story Also:మొదటిసారి మరో హీరోతో.. చెర్రీ క్రేజీ ప్లాన్..!