Tollywood: దళపతి కోసం ఎన్టీఆర్..అదే జరిగితే రచ్చ..రచ్చే..!

దళపతి విజయ్ తాజాగా  ‘మాస్టర్’ అంటూ చిరంజీవి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లోకేశ్ కనకరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి ‘కుట్టి స్టోరీ’ అనే సాంగ్ రిలీజయ్యింది.

Tollywood: దళపతి కోసం ఎన్టీఆర్..అదే జరిగితే రచ్చ..రచ్చే..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 20, 2020 | 12:20 PM

Tollywood : దళపతి విజయ్ తాజాగా  ‘మాస్టర్’ అంటూ చిరంజీవి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లోకేశ్ కనకరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి ‘కుట్టి స్టోరీ’ అనే సాంగ్ రిలీజయ్యింది. స్వయంగా హీరో విజయ్ గొంతు సవరించుకోవడంతో..ఈ పాటకు భలే క్రేజ్ వచ్చింది. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ గురించి ఆసక్తికర అబ్డేట్ ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. యంగ్ టైగర్ యన్టీఆర్..తమిళ‌లో విజయ్ పాడిన పాటను తెలుగులో పాడబోతున్నాడని ఆ వార్తల సారాంశం. తారక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్.. అందులో రెండో ఆలోచనే లేదు. ఇక సింగర్‌గాను పలుసార్లు అలరించాడు తారక్. కెరీర్ తొలినాళ్ల నుంచే తారక్ అవకాశం దొరికినప్పడల్లా తన వాయిస్‌తో మెస్మరైజ్ చేస్తోన్నాడు.

ఇక ‘మాస్టర్’ మూవీకి మంచి బజ్ తీసుకొచ్చేందుకు ‘కుట్టి స్టోరీ’ తెలుగు వర్షన్‌ను ఎన్టీఆర్‌తో పాడించాలని డైరెక్టర్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఫిక్సయ్యి..విషయాన్ని దళపతి దృష్టికి తీసుకెళ్లారట. విజయ్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యి..యంగ్ టైగర్‌కు ఫోన్ కొట్టారట. అడగ్గానే యంగ్ టైగర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాగా తన సినిమాలోనే కాకుండా గతంలో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట పాడారు. విజయ్.. తమిళ్‌లో భయంకరమైన ఇమేజ్ ఉన్న నటుడు. ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోన్న అగ్ర కథానాయకుడు. అయితే మెన్నామధ్య విజయ్, తారక్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. మా హీరో బాగా డ్యాన్స్ చేస్తాడంటే, మా హీరో చేస్తాడంటూ..తెగ డిస్కషన్ నడిపారు. తాజాగా విజయ్ సినిమాలో తారక్ గానీ సాంగ్ పాడితే..అభిమానుల మధ్య ఒక ప్రెండ్లీ వాతావరణం ఏర్పడుతోంది. ఈ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.