Breaking: వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్ల దాడి..!
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఘటన సమయంలో ఆమె భర్త కుమార్‌తో పాటు మరిది గోపి ఆ కారులో ఉన్నారు. విడదల వారి ప్రభను వారు కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కారు ముందు, వెనకాల ధ్వంసం కావడంతో

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఘటన సమయంలో ఆమె భర్త కుమార్‌తో పాటు మరిది గోపి ఆ కారులో ఉన్నారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను వారు కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కారు ముందు, వెనకాల ధ్వంసం కావడంతో పాటు.. గోపికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ దాడి చేసింది టీడీపీ వర్గీయులేనని ఆరోపిస్తున్నారు గోపి సహా ఆమె కుటుంబసభ్యులు. ఘటనపై రజనీ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తును ప్రారంభించారు. కాగా రెండు రోజుల క్రితం ఎంపీ కృష్ణదేవరాయలు కారుపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే.
Follow Us